ఉదయ భానుడి కిరణాలకు మొగ్గలు విచ్చుకుంటున్నాయి
ఆ దృశ్యంలో గొప్పదనము,
విచ్చుకున్న ఆ మొగ్గలదా ?
వికసింప జేసిన ఆ కిరణాలదా ?
విద్వాంసుని పెదవులు వేణువు పై సుస్వరాలు పలికిస్తున్నాయి
ఆ మాధుర్యంలోని గొప్పదనము,
స్వరాలు పలికిన ఆ వేణువుదా ?
పలికింప జేసిన ఆ పెదవులదా ?
శిల్పి చేతిలో రాయి దేవుని ప్రతిమ గా రూపు చెందుతోంది
ఆ ముఖ వర్చ్చస్సు లోని గొప్పదనము ,
ప్రతిమ గా మారిన ఆ రాతిదా ?
అలా మలచిన ఆ శిల్పిదా ?
కళాకారుని చేతిలో మట్టి అందమైన బొమ్మ రూపు సంతరించుకుంటోంది
ఆ సింగారం లోని గొప్పదనము,
బొమ్మలా మారిన మట్టిదా ?
అలా మలచిన ఆ చేతులదా ?
తొలకరి చినుకుకు మయూరము పూరి విప్పి నాట్యమాడుతోంది
ఆ హోయల లోని గొప్పదనము
నాట్యవిలాసము ప్రదర్శించిన ఆ మయూరనిదా ?
పరవసింపజేసిన ఆ వర్షపు జల్లుదా ?
సానపెట్టిన పిదప రంగు రాళ్ళు వజ్రాలు గా రూపాంతరము చెందుతున్నాయి
ఆ రంగుల కాంతుల లోని గొప్పదనము,
మెరుపు సంతరించుకున్న ఆ వజ్రాలదా ?
మెరుపు తెచ్చిన ఆ సాన రాతిదా ?
This comment has been removed by the author.
ReplyDeleteబావుంది.
ReplyDeleteచివరి పాదాలలో ముద్రా రాక్షసాలు ఉన్నాయి . ఆ తప్పులు ఇండిక్ సూచనల తో వచ్చిన తిప్పలనుకుంటా.
నలుపు మీద తెలుపు చూడడానికి బావున్నా చదవడానికి ఇబ్బందిగా ఉంటుంది బా.
కుదిరితే రంగు (చాలా templates ఉన్నాయి) మార్చు. ఇంకా బావుంటుందేమో.