నేను నా మనసు !!!!!
మనసు అనేది ఎక్కడ వుంటుంది?? ఎలాగ వుంటుంది ?? ఇది నా చిన్నప్పటి నుంచీ నాకు వున్న ఒక పెద్ద ధర్మసందేహం
నాకు తెలిసున్న ఇంగ్లీష్ లో మంచి మనసు వున్న వాళ్ళని "కైండ్ హార్టెడ్" అని సంబోధిస్తారు .అంటే మనసు అంటే హార్ట్ కి ఇంకో పేరు అన్న మాట .కాని హార్ట్ అంటే గుండె కదా? అదేమి చోద్యమో!!!. పోనీ కొంత సేపు హార్ట్ నే మనసు అనుకుంటే మనము తీసుకునే నిర్ణయాలన్నీ ఎలాగ జరుగుతాయి ? గుండె రక్త ప్రసరణ చూసుకోవాలా ? లేక ఈ నిర్ణయ భారం నిర్వహించాలా ? మరి మన ఆలోచనా శక్తి కి ఆస్థానం గా చెప్పుకునే "బ్రెయిన్" లేదా మెదడు కి ఏమి పని ఉంటుందో ?
పోనీ బాష తర్జుమా చేసే పని లో కొన్ని లోపాల వల్ల హార్ట్ కి మనసు కి లేని సంబంధం అంట కట్టారు అని అనుకుందాం!
అప్పుడు మళ్ళీ మన మొదటి ప్రశ్న మనసు ఎక్కడ వుంటుంది? ఎలాగ వుంటుంది ? అయితే కొంచెం "లాజిక్" వాడితే
మళ్ళీ ఈ లాజిక్ అనే మెలిక ఎందుకు పెట్టవలసి వచిందంటే నాకు తెలిసి నా బ్రెయిన్ ఇచ్చే కొన్ని సలహాలను (అంటే మామూలు కి మించి ఆలోచనా శక్తి కి పదును పెట్టినప్పుడు వచ్చే సలహాలని )కొంత మంది అతి తెలివైన వ్యక్తులు దానిని సగటు వ్యక్తులకు అర్ధం అయ్యేలా చెప్పలేక "లాజిక్" అనే ఒక నవీన పదాన్ని "ఇంగ్లీష్ " బాష నుంచి అప్పు తెచుకున్నారు
సరే " లాజిక్ " వాడాము ! ఇప్పుడు ఏంటి ?
ఇంకా వుంది . . . .
తెలుగు బ్లాగింగ్ కి స్వాగతం బా. తరచూ రాస్తూ ఉండు.
ReplyDeleteకూడలి , జల్లెడ లో కలుపు నీ బ్లాగ్. ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది